ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. AA-13 బ్లాక్లో మరుగు దొడ్ల పైపు పగిలిపోవడంతో నీరు లీకేజీ అవుతూ దుర్గంధం వెదజల్లుతోంది. నెల రోజులుగా మున్సిపల్ అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.