జిల్లాలో పలుచోట్ల నిర్మాణం గావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వివరిస్తూ జిల్లాలోని చిట్టాపూర్ మరియు ముత్యంపేట గ్రామంలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారని పేర్కొంది. ఈ సందర్బంగా కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతూ త్వరగా పనులు పూర్తిచేయాలనీ ఏదైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని, అదేవిదంగా ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని లబ్ధిదారులు వినియోగించుకోవాలని వారికి సూచించారని పేర్కొంది.