ప్రకాశం జిల్లా మార్కాపురం మరియు పొదిలి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్సై సైదుబాబు మరియు పొదిలి సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై వేమన పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిలువల గురించి ఆరాదీశారు. ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించినట్లు తెలిపారు.