కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం జ్యోతినగర్ లో వనపర్తి సంధ్య అనే యువతి శుక్రవారం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకే ఈ ఘోరానికి పాల్పడినట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వనపర్తి సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ తరలించారు.