శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ పంపిణీ, పీఎం కిసాన్, భూ సర్వే, డాక్యుమెంట్ల అప్లోడ్, యూరియా లభ్యత వంటి అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. 5 నుంచి 20 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ నమోదు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.