ప్యాక్స్ కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, పాలేరు నియోజకవర్గంలో ప్యాక్స్ ద్వారా యూరియా పంపిణీ పైలెట్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.