అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పాత బస్టాండ్ వద్ద శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించిన సందర్భంగా పాడేరు పట్టణంలో 5000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి అనసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.