కార్వేటినగరం మండలం ఆర్కెవీ పేట గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సమస్త ఆధ్వర్యంలో కొబ్బరి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆత్మ సైంటిస్ట్ శ్రీకాంత్ కొబ్బరి రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతుల అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.