ఓబులవారిపల్లి మండలం వై కోటలు విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న నిమదేళ్ల చందన జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెను కోడూరుకు తరిస్తుండగా ఫిట్స్ రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించమని వైద్యులు సూచించారు. అయితే మార్గమధ్యంలో చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.