కూసుమంచి మండలం చౌటపల్లి లో విషాదం చోటుచేసుకుంది.ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులు కావడంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటపల్లి గ్రామానికి చెందిన నూకల సాయి అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేశాడు.అప్పులు తీర్చలేననే ఆవేదన తో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.