రామాయంపేట మున్సిపాలిటీలోని 3వ వార్డులోని సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వ ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురికి నీరు పోవడానికి మోరీల సౌకార్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొన్నే గృహాలు ఉండడం వల్ల చిన్న చిన్న మోరీలు నిర్మించారు.ఇప్పుడు ఈ ప్రాంతంలో భావనల నిర్మాణాలు పెరగడం వల్ల ఇక్కడ ఉన్న మోరిలు సరిపోక మురికి నీరు నిలిచిపోయి దోమలు పెరిగిపోయి దుర్వాసన రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రుల్లో విధి దీపాలు లేకపోవడం చీకట్లో ఉండిల్సి వస్తుందనీ, చెత్త బండి కూడా రోజు రాధాన్నారు.