కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రం బుధవారం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. నిన్న అంతటా కెరటాలు ఎగిసిపడటంతో రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పాడ శివారు కొత్తపట్నం, ఎస్పీజిఎల్ శివారులో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో రాకపోకలకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.