కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్లమరాజు, జమ్మలమడుగు అర్బన్ సిఐ నరేష్ బాబు, ఎస్ఐ హైమావతి,శక్తి టీం బృందాలతో కలిసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత చట్టాలపై, శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల యువత చెడు నడత గురించి, రోడ్డు భద్రత, మహిళల పట్ల జరిగే నేరాలు మొదలగు వాటిపై అవగాహన కల్పించారు.