మచిలీపట్నం లో ఉన్మాదిగా మారిన భర్త అతి కిరాతకంగా భార్యను మెడపై కోశాడు. భార్యాభర్తలకు ఇరువురికి గత నాలుగు నెలల క్రితం విడాకులు మంజూరు కాగా, విడాకులు ఇవ్వటంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త శ్రీరామరాజు శుక్రవారం భార్యను హతమార్చాలనే పక్కా పథకంతో పూటుగా మద్యం సేవించి మచిలీపట్నంలోని సర్కిల్ పేటలోని భార్య ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా, అతి కిరాతకంగా కత్తితో దాడి చేసాడు. ఆమెను ఆసుపత్రికి తరలించారు.