పిజిఆర్ఎస్ పెండింగ్ అర్జీల పరిష్కారానికి వేగవంత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ కంట్రోల్ రూమ్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి పిజిఆర్ఎస్ అర్జీల పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.