కంబదూరు మండల కేంద్రానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే నెపంతో గత మంగళవారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రకాష్ ను పోలీసులు వేధించి కొట్టడం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ప్రకాష్ పోలీస్ స్టేషన్లోని చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ప్రకాష్ ఆత్మహత్యయత్నం ఘటనపై రహస్యంగా లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.