శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఇజ్జవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు నందిగాం మండలం కనితూరు గ్రామానికి చెందిన కంచరాన చంటి గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు మూలపేట పోర్ట్ లో పోక్లైన్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు.