మాజీ ఎంపీ, వైసీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలా స్వామి అన్నారు. కళ్యాణదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైసీపీ పార్టీ పై ధ్వజమెత్తారు. తలారి రంగయ్య బీటీపీ కెనాల్ పనులు జరుగుతున్న బ్రహ్మసముద్రం మండలానికి వెళ్లకుండా పనులు జరగని కుందుర్పి మండలానికి వెళ్లి పనులు జరగడంలేదని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలు, మోసాలు, అక్రమాలు చేసే పార్టీ వైసీపీ నేనన్నారు. బీటీపీ కాలువ పనులు చేసి కళ్యాణదుర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు