కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.సి.బెలగళ్ మండలం పొలకల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి, ఆయన భార్య అరుణమ్మ (46) ద్విచక్రవాహనంపై కర్నూలు వస్తుండగా, వెనక నుంచి వేగంగా వచ్చిన AP39 MN 7857 న్యూ షిఫ్ట్ కారు ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో దంపతులు రోడ్డుపై పడిపోగా, అరుణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వర రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభ