కళ్యాణదుర్గం మండల కేంద్రంతోపాటు మండల వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ గురువారం చెప్పారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. అయితే చాలా రోజులు తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.