Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి,ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాలకు జిల్లా కేంద్రం నుంచి గణనాధులను ప్రజలు డబ్బు వాయిద్యాల నడుమ తరలిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని, వినాయకుని దయ వల్ల ప్రజలందరూ సుఖసంతోషాలు,పాడిపంట సమృద్ధిగా పండి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.