ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను వివక్షకు గురి చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ మండిపడ్డారు. శనివారం ఉదయం 12 గంటలు కర్నూలు లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. వర్గీకరణపై తెలంగాణ, ఏపీలో మాలలను తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఈ కుట్రను చూస్తూ ఊరుకోమని రత్నాకర్ హెచ్చరించారు. రెండు రాష్ట్రాల్లో మాలలను సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్న అంశం పై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి చైతన్య పరుస్తున్నామని ఆయన తెలిపారు. వర్గీకరణపై మాల మేధావులు, మాల రాజకీయ నేతలు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.