సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం హద్నూర్ గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో జూదం ఆడుతున్న ఇద్దరు జూదరులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జూదం ఆడుతుండగా పట్టుకుని వారి వద్ద నుండి రూ:3400 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట, జూదం ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.