ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఆసరా పింఛన్లను పారదర్శకంగా,సకాలంలో లబ్ధిదారులకు అందిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక పరిధి 76వ వార్డుగోపాల్ రెడ్డి నగర్ లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.