పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అందజేసారు. ఆదివారం ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 82 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరుకాబడిన 43,19,077 రూపాయలు విలువకలిగిన చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేసారు.