ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేషన్స్ జడ్జి కం చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పి నీరజ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి పి నీరజ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంవత్సరంలో మూడుసార్లు అనగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇందులో రాజీమార్గమే రాజ మార్గమని రాజీ పడదగిన క