రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 25 రోజుల క్రితం ముగ్గురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారని OU,BRSV రాష్ట్ర విద్యార్థి కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ జరిగి 25 రోజులు గడుస్తున్నప్పటికీ గురుకులం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు.జిల్లా అధికారులకు విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. గురుకులంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.