గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారి 44 పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్గేట్ వరకు భారీగా వాహనాలు నిలిచాయి. వాగులు వంకలు పొంగి పొల్లడంతో రహదారి దెబ్బతింది. దీంతో హైదరాబాద్ వైపు వేళ్లే లారీలు బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పండుగకు వచ్చి తిరిగి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.