అద్దంకి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని సీఐ సుబ్బరాజు గురువారం తెలిపారు. విగ్రహాల కార్యకలాపాలకు సంబంధించి కమిటీ వారిదే పూర్తి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఎవరైనా రాజకీయాల పరంగా విద్వేషాలు రెచ్చగొడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.