కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జేఎన్టీయూలో జరిగిన సమావేశంలో ఇస్కాన్ ప్రెసిడెంట్ మహా శృంగదాసు పాల్గొన్నారు. చెడు అలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తుందని, ప్రజల్లో అవగాహన పెంచడమే తమ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శోభారాణి, ఇస్కాన్ సెక్రటరీ శ్రీవాణి, కోఆర్డినేటర్ అచ్యుత పాల్గొన్నారు.