కాలోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని డిసిపి కార్యాలయంలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం డిసిపి మాట్లాడుతూ తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు రాసి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప ప్రజాకవి కాలోజీ అని కొనియాడారు.