దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు గుండెల్లో నిలిచిపోయారని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష పేర్కొన్నారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎంతోమంది ప్రజలు లబ్ది పొందాలని చెప్పారు. దివంగత నేత మృతి చెంది 16 సంవత్సరాలు అవుతున్న ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ లో ఏపీసీసీ చీప్ వైఎస్ షర్మిల రెడ్డితో కలిసి వైయస్సార్ ఘాటు వద్ద దివంగత నేతకు నివాళులర్పించినట్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష పేర్కొన్నారు.