సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిరేవులో వరద ఉధృతి కారణంగా సఖినేటిపల్లి, నరసాపురం మధ్య పంటు రాకపోకలు ఆదివారం నిలిచిపోయాయి. పంటు రాకపోకలు నిలిచిపోవడంతో సఖినేటిపల్లి, మలికిపురం మండలాల ప్రజలు, నరసాపురం వెళ్లవలసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు చించినాడ బ్రిడ్జి మీదుగా రాకపోకలు కొనసాగించవలసి వస్తుంది.