గత ఐదు సంవత్సరాలలో ఎంపీగా పని చేసిన సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను పట్టించుకోకుండా ఉండి నేడు రైతుల కోసం వంగా గీతా విశ్వనాధ్ ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.