నాలుగు రోజుల క్రితం ఆచారి వీధిలో రోడ్డు ప్రమాదం జరిగి, 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని చిన్న బజారు పోలీసులు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి కోరారు..