పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 30వ వార్డు షరీన్ నగర్‌లో మంగళవారం వైఎస్సార్ 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో డా.వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు వంద శాతం అందజేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.