కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దేవరయంజాల్ లో బుధవారం విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక జయదర్శని కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో విద్యుత్ పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి కృష్ణ ఒకసారి గా బిల్డింగ్ పై నుంచి కిందపడి మృతి చెందాడు. మృతుడు కొడంగల్ పరిధి భూమిరాశి పేట వాసిగా గుర్తించారు. అతడికి భార్య పూజ, ఒక పాప ఉన్నారు. తమకు న్యాయం చేయాలని తల్లి లక్ష్మీ రోదించింది.