అయిజ మండల కేంద్రంలోని అఖిల పక్షం ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా అయిజ మున్సిపాలిటీ కేంద్రాన్ని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కృషి చేస్తున్నట్లు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరు సమిష్టిగా నూతన రెవిన్యూ డివిజన్ కోసం కృషి చేయాలని కోరారు.