మనుబోలులోని గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని లైబ్రేరియన్ అరుణ్ కుమార్ మండలాధికారులను కలిశారు. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవన స్థానంలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీలో తాసిల్దార్ ఎంపీడీవో సభ్యులుగా ఉన్నారని అందుకే వారిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు.