నందిపేట్ మండలంలోని ఉమ్మేడ గోదావరి బ్రిడ్జి పై గణనాథుల నిమజ్జన ఏర్పాట్లను శనివారం సాయంత్రం 5:30 కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వివిధ అధికారులతో కలిసి పరిశీలించారు. క్రేన్లతో వినాయక విగ్రహాలను బ్రిడ్జి పైనుండి నిమజ్జనం చేసే ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు