సదాశివపేటలో సెప్టెంబర్ 6వ తేదీన వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. పట్టణంలోని శ్రీరామ మందిరంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన బాల వినాయకులను, 6వ తేదీన పెద్ద వినాయకులను నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వినాయక మండప నిర్వాహకులు గమనించాలని వారు కోరారు.