తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నంద్యాల జిల్లా కోటపాడుకు చెందిన మారుతమ్మ ఆసుపత్రి నిమిత్తం పట్టణాకి వచ్చారు. తిరిగి ఊరికి వెళ్తున్న సమయంలో ఉంగరాలు, నగదు ఉన్న పట్టును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లు గుర్తించిన బాధితురాలు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.