ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రైతుల కోసం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల కోసం పెద్ద ఎత్తున మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపి వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు రైతులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.