ఆసిఫాబాద్ జిల్లాలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరపడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని KVPS జిల్లా కార్యదర్శి దినకర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి నెల చివరి వారంలో అన్ని శాఖల అధికారులతో పౌర హక్కుల సమావేశం నిర్వహించాలన్నారు.కానీ అది జిల్లాలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో తూతూ మంత్రంగా నిర్వహించినప్పటికీ మండల అధికారులు హాజరు కాలేకపోతున్నారు.