ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉపముతుంది. దీంతో భద్రాచలం మరియు ధవలేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13.8 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులు 175 గేట్లు ఎత్తి 13 లక్షల 5 వేల 404 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.