అందరి సహకారంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగినట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాలన్నారు సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతను కాపాడుకుంటూ నిర్వహించాలని సీఎం చంద్రబాబు తమకు దిశా నిర్దేశం చేశారని అన్నారు భక్తులకు వసతి సదుపాయం భోజనం సౌకర్యం మెడికల్ సైతం ఏర్పాటు చేశామన్నారు గరుడసేవ రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు.