కొత్తపేట లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ మాట్లాడారు. మామిడి తాండ్రపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో దానిపై జీవనోపాధి పొందే వారికి మేలు జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కనకేశ్వర రావు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు