జిల్లాలోని మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో గల టిడ్కో సముదాయాల్లో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై ఎదురు నివాసముండే కొమ్మూరి ఇంద్ర అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం అత్యాచారయత్నం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. వెంటనే మైనర్ బాలిక కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారి వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వెల్లడించారు.