ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సీఎం చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ లో రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీస్ ను pvp పద్దతిలో ప్రైవేట్ పరం చేయడాన్ని, వైఎస్ ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ని తీసివేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని మండిపడ్డారు.