వాయిస్ ఓవర్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లోని కౌలాస్ నాల ప్రాజెక్ట్ కు వరద పోటెత్తింది. గురువారం ప్రాజెక్ట్ లోకి 30682 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ప్రాజక్ట్ అధికారులు 6 గేట్లను ఎత్తి దిగువకు 30,682 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు కాగ ప్రస్తుతం 457.80 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.237 టిఎంసి లు కాగ ప్రస్తుతం 1.118 టిఎంసి ల నీటి నిలువలు ప్రాజెక్ట్ లో ఉన్నాయని ఏఈ సుకుమార్ తెలిపారు.